నవతెలంగాణ – నెల్లికుదురు
వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించినట్లు ఆ సంఘం జిల్లా నాయకుడు ఈసంపల్లి సైదులు తెలిపారు. మండల కేంద్రంలోని కార్మికులతో కలిసి గురువారం సభలపై అవగాహన కార్యక్రమాన్ని ముఖ్య కార్మిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక గ్రామీణ పేదల సంఘం గ్రామ మండల మహాసభలు నవంబరు నెలలో జరుగుతున్నాయని తెలిపారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యవసర వస్తున్న ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని వీటిని కొని తినలేని పరిస్థితుల్లో పేదలు జీవిస్తున్నారని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజు వేతనం పెరగడం లేదు అని అన్నారు . విద్య వైద్యం భరించలేని భారంగా మారిపోయిందని పాలకవర్గాలు ఈ రెండు రంగాలను కార్పొరేట్ రంగాలకు మార్చాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. విద్య వైద్యం మా బాధ్యత కాదనే భావనతో ఉన్నాయని వీటి ఫలితంగా స్కూల్ ఫీజులు మందులు ధరలు సెల్ఫోన్ టీవీ చార్జీలు పెంచి పేదల బతుకులు నాశనం చేస్తున్నారు అన్నారు.
వ్యవసాయ కార్మికులు గ్రామీణ పేదలు పట్టణాలకు వలసలు వెళుతున్నారు అక్కడ కనీస వేతనాలు అమలు జరగడం లేదు అని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వందరోజుల పనిలో కూడా రోజు వేతనం 307 నిర్వహించిన అమలు కావడం లేదు కనీస వేతన జీవోను సవరించి వ్యవసాయ గ్రామీణ పేద కార్మికులకు కూలి రేట్లు పెంచి అమలు మని కోరినట్లు తెలిపారు. రోజు వేతనం 800 రూపాయలు ఇవ్వాలి వ్యవసాయ కార్మికుల గ్రామీణ పేద సంక్షేమానికి సమగ్ర చట్టం తక్షణమే ఏర్పాటు చేయాలి అని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన హామీలను పెన్షన్ పెంపు 2000 నుండి 4 వేలకు వికలాంగులకు 6000 మహిళలకు 2500 ఇవ్వాలి భూమిలేని వ్యవసాయ కార్మికుల గ్రామీణ పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతి సంవత్సరం 12000 ఇవ్వాలి.
ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలం ఇచ్చి ఇందిరమ్మన్లు మంజూరు చేయాలి. ప్రమాదంలో ఇతర కారణాల మరణించిన గాయపడిన ఎక్సర్గే చెల్లించాలి. ఆరోగ్య బీమా ఇన్సూరెన్స్ అమలు చేయాలి నివాస ప్రాంతాలు సిసి రోడ్లు సైడ్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి .ఈ డిమాండ్ల సాధనకై సంఘం సంఘటితపరచుకోవడానికి గ్రామీణ స్థాయిలో మహాసభలు నిర్వహిస్తూ మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి మహాసభలు నిర్వహించబడుతున్నాయని వాటి జయప్రదనికై వ్యవసాయ కార్మికులు అందరూ కలిసి పోరాటంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు బాణాల యాకయ్య మరియు ఇసంపల్లి ఐలేష్ వెంకన్న శీను బిక్షపతి ఆర్ యాకయ్య తదితరులు పాల్గొన్నారు.



