Friday, May 16, 2025
Homeరాష్ట్రీయంఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించండి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించండి

- Advertisement -

– సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్‌ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. అసెంబ్లీ సాక్షిగా ఫీజురీయింబర్స్‌మెంట్‌పై సీఎం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. బకాయిలు చెల్లించకపోవడంతో ప్రయివేటు కళా శాలల యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయనీ, అధ్యాపకులకు, సిబ్బందికి జీతభత్యాలు, మెయింటెనెన్స్‌ చార్జీలు కూడా చెల్లించకలేక ఇబ్బంది పడుతున్నాయని లేఖలో ప్రస్తావించారు. ఇప్పటికే అనేక డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలలు మూతపడ్డ విషయాన్ని ఎత్తిచూపారు. శాతవాహన వర్సిటీ పరిధి లోనే పదుల సంఖ్యలో డిగ్రీ కళాశాలలు మూతపడ్డాయని తెలిపారు. ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోకపోవడంతో కొన్ని కాలేజీలు సర్టిఫికెట్లను ఇవ్వడం లేదనీ, దీంతో పిల్లలు ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు దూరం అవుతున్నారని వివరించారు. విద్యార్థులకు, కాలేజీ యాజమాన్యాల మధ్య గొడవలై పోలీస్‌ స్టేషన్ల దాకా కేసులు వెళ్తున్నా పట్టించుకోరా? అని ప్రశ్నించారు. ఫీజు బకాయిలన్నీ వన్‌ టైం సెటిల్‌మెంట్‌ చేస్తామని ఒకసారి, 12 వాయిదాల్లో చెల్లిస్తామని మరోసారి చెప్పిన విషయాన్ని మర్చిపోయారా? అంటూ చురకలు అంటించారు. విద్యార్థుల భవిష్యత్తు, యాజమాన్యాల మనుగడను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -