Friday, November 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకేవలం 10 రూపాయలకే..

కేవలం 10 రూపాయలకే..

- Advertisement -

ప్రస్తుతం పలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ ప్రేక్షకులను అలరించటానికి అనేక సినిమాలను, వెబ్‌సిరీస్‌లను, ఇతర కార్యక్రమాలను ప్రసారం చేస్తూ దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా భారతీయ ఓటీటీ రంగంలోకి ‘టీబీడీ’ (త్రిభాణధారి) ఓటీటీ అడుగుపెట్టింది. దుబాయ్‌ కేంద్రంగా నడుస్తున్న రాయల్‌ ర్యాప్చీ సంస్థ దీన్ని నిర్వహిస్తోంది. ఈ సంస్థ ఇటీవలే దుబాయ్‌లో ఘనంగా లాంచ్‌ అయిన ‘టీబీడీ’ ఓటీటీ ఇప్పుడు భారతదేశంలో రూట్‌ లెవల్‌కు విస్తరించటానికి ప్లాన్‌ చేసుకుంది. ఇందులో భాగంగా ఇటీవల లోగో లాంచ్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంది.

ఈ వేడుకకు సంస్థ ఫౌండర్‌, ఎండీ ధరమ్‌ గుప్తా, సీఈఓ సునీల్‌ భోజ్వానీ, సౌత్‌ ఇండియా సీఈఓలు నటులు, నిర్మాత డి.యస్‌.రావు, దర్శకుడు వి. సముద్రలతో పాటు దర్శకులు వి.యన్‌.ఆదిత్య, చంద్రమహేష్‌, ఇ.సత్తిబాబు, శివనాగు, డిజిక్వెస్ట్‌ అధినేత బసిరెడ్డి, ‘సంతోషం’ అధినేత సురేష్‌ కొండేటి, నటుడు దాసన్నతో పాటు పలువురు నిర్మాతలు, చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత కె.కె. రాధామోహన్‌ చేతులు మీదుగా ఈ యాప్‌ లాంచ్‌ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టిబిడి ఫౌండర్‌, ఎండీ ధరమ్‌గుప్తా మాట్లాడుతూ,’ఇందులో మన దేశీయ కంటెంట్‌ మాత్రమే ఉంటుంది. అందులోనూ కుటుంబం అంతా కూర్చుని చూసే వల్గారిటీలేని కంటెంట్‌ మాత్రమే ఉంటుంది. ఈ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ కేవలం 10 రూపాయలు మాత్రమే. ఇది ప్రపంచం ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ చరిత్రలో నెవర్‌ బిఫోర్‌ అని గర్వంగా చెప్పగలను’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -