– ఎన్డీఎస్‌ఏ సిఫారసుల అమలు కష్టమే
– చేతులెత్తేసిన నీటిపారుదల శాఖ
– తాజా సిఫారస్సే నిదర్శనం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు భవితవ్యం ఇప్పట్లో తేలేలా లేదు. రూ. లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు ఉనికి ప్రశ్నార్థకమవుతున్నది. పలు రకాల కమిటీలు, ఇంజినీరింగ్ నిపుణులు కాళేశ్వరం పనికొస్తుందా ? లేదా ? అనే సంగతిని ఇంకా తేల్చలేకపోతున్నాయి. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ(ఎన్డీఎస్‌ఏ) సైతం ఇటీ వల కొన్ని సిఫారసులు చేసిన విషయం విదితమే. కాగా వాటిని అమలు చేయడం అంత సులభం కాదనే భావనలో నీటిపారుదల శాఖ ఉంది. ఎన్డీఎస్‌ఏ మార్గదర్శకాలను అమలుచేయడానికి జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో ప్రత్యే కంగా కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ స్పష్టం చేసింది. తద్వారా తామేమీ చేయలేమని చెతులేత్తేసినట్టయింది. ఈమేరకు సర్కా రుకు సమాచారం ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం ఇతమిద్దంగా నిర్ణయం తీసుకో లేదు. నీటిపారుదల శాఖ వర్గాల్లో మాత్రం చర్చకు ఆస్కారం కలిగింది. కాళే శ్వరం పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు దెబ్బతిన్నాయి. నాణ్య తాలోపాలతో మేడిగడ్డ బ్యారేజీలోని ఫియర్స్ బలహీనమయ్యాయి. పగుళ్లు వచ్చాయి. ఏడో బ్లాకు ఎందుకు పనికాదని ఎన్డీఎస్‌ఏ తేల్చింది. ఆ బ్లాకును మర మ్మతులు చేయడం కూడా సాధ్యం కాదని అంటున్నది. ఇటు పక్క ఆరో బ్లాకు, అటు పక్క ఎనమిదో బ్లాకుకు ఎలాంటి నష్టం జరగకుండా ఏడో బ్లాకును తొలగిం చాల్సి ఉంటుంది. అసలు తొలగించాలా ? మరమ్మతులు చేస్తే సరిపోతుందా ? అనే విషయాన్ని తేల్చడంలో ఇటు ఎన్డీఎస్‌ఏ, ఈటు నీటిపారుదల శాఖ అధికా రుల కమిటీ స్పష్టంగా చెప్పలేదు. అలాగే మేడిగడ్డ, సుందిళ్లల్లో బుంగలు(సీపేజీ) వచ్చాయి. వాటికి గత వర్షాకాలంలో తాత్కాలిక మరమ్మతులు చేశారు.మేడిగడ్డ బ్యారేజీకి గ్రౌటింగ్ పనులు కొంతమేర చేశారు. దీంతో వర్షాకాలం గడిచిపోయింది. బ్యారేజీల్లో నీరు నిల్వచేయకుండా వచ్చింది వచ్చినట్టు వదిలేశారు. బ్యారేజీలో నీరు నిల్వ చేస్తే కొట్టుకుపోయే ప్రమాదముందని అంతకు ముందే ఎన్డీఎస్‌ఏ చెప్పడంతో కాళేశ్వరం గేట్లు అన్ని ఓపెన్ చేసి పెట్టారు. కాగా అవసరమైన అన్నీ అంశాలపై పరిశోధనలు చేయాలని నీటిపారుదల శాఖ కమిటీ సూచించినట్టు తెలిసింది.
బ్యారేజీలకు మరమ్మతులు సాధ్యమేనా !?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES