తాండూరు కేంద్రంగా రూ.500 నోట్ల తయారీ
హైదరాబాద్‌లో గుట్టు రట్టు
నవతెలంగాణ-తాండూరు
వికారాబాద్ జిల్లా తాండూరులో రూ.500 నకిలీ నోట్ల తయారీ కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో గుట్టు రట్టయ్యింది. ముఠా వెనుక ఉన్న సూత్ర దారి నకిలీ నోట్లు ఎలా తయారు చేస్తారు? వాటిని ఎలా చెలామణి చేస్తారు? అనే షాకింగ్ నిజాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. కోస్గి మండలం గుండిమల్ గ్రామానికి చెందిన కస్తూరీ రమేష్‌బాబు, అతని సోదరి రామేశ్వరీపై గతంలో నకిలీ నోట్ల విషయంలో పలు పోలీస్‌స్టేషన్‌లలో కేసులు నమోదై ఉన్నాయి. కొన్ని నెలలుగా రమేష్‌బాబు, రామేశ్వరీ.. తాండూరు పట్టణం కోకట్ రోడ్డు మార్గంలోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. గతంలోనే నకిలీ నోట్ల తయారీలో నైపుణ్యం ఉన్న రమేష్ బాబు రూ.500 నోట్లను అసలు మించి ఉండేలా నకిలీ నోట్లను తయారు చేశాడు. వాటిని చెలామణి చేసేందుకు ఇన్‌స్టాగ్రాం ద్వారా పోస్టు పెట్టారు.
ఇది చూసిన అబ్దుల్ వహీద్, తహాన్.. రమేష్‌ను సంప్రదించారు. వారు ఓ ముఠాగా ఏర్పడి నోట్ల చెలామణికి పాల్పడుతున్నారు. కస్తూరి రమేష్ బాబు ముందుగా 500 నోటును స్కాన్ చేసి ప్రింట్ తీస్తారు. జేకే బాండ్ పేపర్‌తో సమానంగా కట్ చేసి.. ఆ వెంటనే ఓ గ్రీన్ ట్యాగ్‌ను పేవికాల్‌తో అతికించి అసలుకు మించిన నకిలీ నోటును తయారు చేస్తాడు. అనంతరం రమేష్ బాబు నుంచి వాహిద్, అతని స్నేహితులు ఒక అసలు నోటుకు నాలుగు నకిలీ తీసుకుని, తరువాత వారు సోహైల్, ఫాహెద్ అలీలకు ఒక అసలు నోటుకు మూడు నకిలీ నోట్లు, అ తరువాత వారిద్దరు ఇమ్రాన్, ఓమర్.. ఒక అసలు నోటుకు రెండు నకిలీ నోట్లు అందిస్తూ చెలామణిని ప్రారంభించారు. ఈ మేరకు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి మొత్తం 950 నోట్లను స్వాదీనం చేసుకున్నారు. 950 నకిలీ నోట్లతో రూ.4.75లక్షలను తయారు చేశారని తెలిపారు. ఈ మేరకు రమేష్ బాబుతోపాటు 8 మంది ముఠా సభ్యులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
నకిలీ నోట్ల కలకలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



