పిఈటీ నుంచి సన్మానించిన పూర్వ విద్యార్ధులు

నవతెలంగాణ- డిచ్ పల్లి:
ఎంతో మంది విద్యార్థులను  జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో హాకీ లో ఉత్తమ  క్రీడాకారులుగా, సైనికులుగా  తీర్చిదిద్దిన   పీ.ఈ టీ.చిన్నయ్య ను 2003-2004 పదవ తరగతి పూర్వ విద్యార్ధులు గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందల్ వాయి మండలంలోని ఎల్లారెడ్డి పల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించే సమయంలో పిఈటీ చిన్నయ్య తనవంతు పాత్ర పోషిస్తూ పాఠశాల కు వచ్చే విద్యార్థులకు విద్యా తో పాటు ఉత్తర క్రీడాకారులు గా తీర్చిదిద్యాలు ముఖ్యమైన పాత్ర పోషించారని అలాంటి పిఈటీ పాఠశాల లో ఉండటం అదృష్టంగా భావిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమం లో 2003-2004 పదవతరగతి పూర్వ విద్యార్ధులు, అద్యపకులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love