- Advertisement -
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో జెపి ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) మనోజ్ గౌర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. నివాస కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని అక్రమంగా మళ్లించిన కేసులో గౌర్‌ను కస్టడిలోకి తీసుకుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద ఈ కేసు నమోదయ్యింది. ఈ ఏడాది మేలో జేపీ ఇన్‌ఫ్రాటెక్, జేపీ అసోసియేట్స్‌తో పాటు వాటి అనుబంధ సంస్థల్లో ఇడి సోదాలు నిర్వహించగా.. దాడుల్లో రూ.1.7 కోట్ల నగదు, ఆర్థిక లావాదేవీల పత్రాలు, డిజిటల్ డేటా, ప్రమోటర్లు, వారి కుటుంబసభ్యులు, గ్రూప్ కంపెనీల పేర్లపై నమోదైన ఆస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -



