Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసింగరేణి ఓసీపీ-2లో భారీ బ్లాస్టింగ్‌

సింగరేణి ఓసీపీ-2లో భారీ బ్లాస్టింగ్‌

- Advertisement -

– బండరాళ్లు ఎగిరిపడి ఇండ్లు ధ్వంసం
– పలువురికి గాయాలు
– ప్రధాన రహదారిపై గ్రామస్తుల రాస్తారోకో
నవతెలంగాణ – రామగిరి

పెద్దపల్లి జిల్లా సింగరేణి రామగుండం-3 డివిజన్‌ పరిధిలోని ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్ట్‌-2 క్వారీ పక్కన ఉన్న ఎల్‌-6 కెనాల్‌లో గురువారం మధ్యాహ్నం పెద్దఎత్తున బ్లాస్టింగ్‌ జరిగింది. దాంతో సమీపంలోని నాగపల్లి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. భారీ పేలుడు ధాటికి బండరాళ్లు ఎగిరి ఇండ్లపై పడటంతో ఆస్తి నష్టం సంభవించడమే కాకుండా, పలువురికి గాయాలయ్యాయి. బ్లాస్టింగ్‌ శబ్దానికి భూమి కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక జనం పరుగులు తీశారు. పెద్దపెద్ద బండరాళ్లు ఇండ్లపై పడటంతో రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సింగరేణి అధికారులు పేలుడు పదార్థాల మోతాదు పెంచి బ్లాస్టింగ్‌ చేపట్టడమే ఈ ఘటనకు కారణమని ఆరోపించారు. నిత్యం జరుగుతున్న బ్లాస్టింగ్‌ల వల్ల గ్రామంలో ఉండలేకపోతున్నామని ఆవేదన చెందారు. ఈ బ్లాస్టింగ్‌లకు నిరసనగా గ్రామస్తులంతా ప్రధాన రహదారిపైకి చేరుకొని బైటాయించి రాస్తారోకో చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులను సముదాయించే ప్రయత్నం చేశారు. బ్లాస్టింగ్‌ల ప్రభావానికి ఎగిరిపడిన పెద్దపెద్ద బండరాళ్లను, గాయపడిన వారిని చూపించి సింగరేణి అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని గ్రామస్తులు భీష్మించుకుని కూర్చున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad