Friday, November 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుషాద్ నగర్ లో వ్యక్తిని సజీవదహనానికి యత్నం..!

షాద్ నగర్ లో వ్యక్తిని సజీవదహనానికి యత్నం..!

- Advertisement -

– తృటిలో తప్పిన ప్రమాదం  పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు….
– ఖంగుతిన్న కాలనీవాసులు..
నవతెలంగాణ – షాద్ నగర్ రూరల్ 
: ఓ వ్యక్తిని సజీవ దహనం చేయడానికి ప్రయత్నించిన సంఘటనపై షాద్ నగర్ ప్రజలు ఉల్కికి పడ్డారు.  అంతర్గత గొడవలు ఏమో తెలియదు కానీ పెట్రోలు పోసి సజీవ దాహానికి కుట్ర పూనుకున్నారు. అగంతకుడు చేసిన విధారణ ఈ యత్నానికి షాద్ నగర్ పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.  రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ తిరుమల కాలనీకి చెందిన సంభారపు శ్రీను అనే వ్యక్తి టీ స్టాల్ నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు అయితే రోజు మాదిరిగానే తెల్లవారు జామున 3గంటలకు టీ స్టాల్ నడిపించుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అదే సమయంలో  ముసుగుతో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి జగ్గులో వెంట తీసుకు వచ్చిన పెట్రోల్ శ్రీనుపై చల్లారు.

అంతలోనే శ్రీను పెద్దగ అరవడంతో ఇంటిలో రెంటుకు ఉన్న వ్యక్తులు రావడం చూసి పారిపోతుండగా ఆయన వెంట తరుముకుంటు వెళ్లారు. అయితే వీరికి చిక్కకుండా పారిపోయాడని బాధితుడు శ్రీనివాస్ తెలిపారు. అతని వద్ద రెండు పెట్రోల్తో నిండిన బెలున్లు ఉన్నట్లు వివరించారు. జగ్గులో ఉన్న పెట్రలో పోసి అగ్గిపుల్లతో అంటించి మరింత మండడానికి పెట్రోల్ తో ఉన్న బెలూన్లను వేసి శరీరం బాగం కాల్చడానికి ముందుగా ప్లాన్ వేసుకున్న నిందితుని ఆలోచన తెలిసిన తిరుమల కాలనీ వాసులు నివ్వెర పోయారు. ఈ సంఘటనతో భయాందోళనకు గురైన శ్రీను షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సజీవ దహనానికి యత్నంచిన వ్యక్తిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను వేడుకున్నారు. ఫిర్యాదు పై ఎస్ఐ రామచంద్రయ్య తిరుమ కాలనీ లోని శ్రీను ఇంటికి వచ్చి పరిశీలించారు. సంఘటన వివరాలను తెలుసుకున్నారు. శ్రీను ఇచ్చిన ఫిర్యాదు పై సిఐ విజయ్ కుమార్ సూచనల మేరకు విచారణ జరుపుతున్నామని ఎస్ఐ రాంచంద్రయ్య తెలిపారు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -