- Advertisement -
– రోడ్డు ప్రమాదమా?…హత్యనా..?
నవతెలంగాణ-మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన గాదనవేన రాజయ్య (48) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన పెద్దతూoడ్ల గ్రామ పరిదిలోగల సబ్ స్టేషన్ రోడ్డు ప్రక్కన శుక్రవారం చోటుచేసుకుంది.గురువారం పెద్దతూoడ్ల గ్రామానికి వెళ్లినట్లుగా స్థానికులు చెబుతున్నారు.సంఘటన స్థలానికి కొయ్యుర్ పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. రాజయ్యది హత్యని కొందరు అనుమానం వ్యక్తం చేస్తే, కాదు రోడ్డు ప్రమాదం కావచ్చని మరి కొందరు చెబుతున్నారు.ఏదిఏమైనా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



