Friday, May 16, 2025
Homeరాష్ట్రీయం270 ఎకరాల్లో వ్యాపించిన మంటలు

270 ఎకరాల్లో వ్యాపించిన మంటలు

- Advertisement -

– ప్రమాదవశాత్తు గడ్డి మాములు దగ్ధం
– వరి కొయ్యలు తగలబెట్టగా.. గాలికి ఎగిసి పడుతున్న మంటలు
– ఖమ్మం జిల్లా పాలేరు గ్రామంలో ఘటన
నవతెలంగాణ-కూసుమంచి

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్‌ చిన్న కాలువ పక్కనున్న పొలాల్లో కొంతమంది వరి కొయ్యలకు నిప్పు పెట్టగా ప్రమాదపుశాత్తు మంటలు వ్యాపించాయి. సుమారు 700 వందల గడ్డి మోపులు దగ్ధం అయినట్టు సంబంధిత రైతులు తెలుపుతున్నారు. అంతేగాక పొలాల్లో ఉన్న మోటార్లు, కరెంట్‌ వైర్లు అగ్నికి ఆహుతి అయినట్టు వాపోయారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలేరు గ్రామంలోని చిన్న కాలువ వెంట ఉన్న పొలాల్లో ఒక ముగ్గురు రైతులు తమ పొలంలో ఉన్న వరి కొయ్యలు తగల పెట్టడానికి మంట పెట్టడంతో ఆది కాస్తా గాలికి అగ్ని తోడుకావడంతో మంటలు చుట్టూ వ్యాపించాయి. సుమారు 270 ఎకరాల పొలాల్లో గాలికి మంటలు వ్యాపించి అంతా దగ్ధం అయ్యాయి. చుట్టూ ఉన్న మొత్తం గడ్డివాములు, కరెంట్‌ మోటార్లు, కరెంట్‌ వైర్లు అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. మధ్యాహ్నం మొదలైన మంట రాత్రి 10 గంటల కల్లా మొత్తం సుమారు 270 ఎకరాలకు వ్యాప్తించి పాలేరు పాత రోడ్డు దగ్గర నుంచి కొత్త హైవే వరకు వ్యాపించాయి. వరి కొయ్యలు తగల బెట్టవద్దన్న నిబంధన ఉన్నా కొంతమంది రైతులు చేసిన పనికి ఇంత నష్టం వాటిల్లిందని నష్టపోయిన రైతులు వాపోతున్నారు. తాము ధాన్యం కల్లాల వద్ద ఉంటే ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని, తాము వచ్చేసరికి అంతా నష్టం జరిగిపోయామంటూ పలువురు రైతులు తమ గోడు వెల్లబుచ్చారు. కాగా ఫైర్‌ ఇంజన్‌కు సమాచారం ఇచ్చినట్టు రైతులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -