నవతెలంగాణ-మల్హర్ రావు
మండలం రుద్రారం గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో చఫువుతున్న విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైనట్లుగా మండల ఎంఈఓ లక్ష్మన్ బాబు, వ్యాయమ ఉపాధ్యాయుడు అమరాజి సతీష్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్ పి ఎస్) గ్రౌoడ్ లో జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల్లో అండర్ -17 విబాగంలో టి.అంజనీకుమారి,అండర్-14 విభాగంలో ఎన్. నందిశ్వర్,ఆర్. అశోక్ అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటాలకు ఎంపికైనట్లుగా తెలిపారు. ఈ నెల చివరివారంలో వనపర్తి జిల్లా పట్టణంలో నిర్వహించే టౌర్నమేంట్ రాష్ట్రస్థాయి ఫోరిటాలకు ఎంపికైన విద్యార్థులను ఎంఈఓ తోపాటు ఉపాధ్యాయులు అభినందించారు.
రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు రుద్రారం విద్యార్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



