నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద డయాబెటిక్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో ఫ్రీ డయాబెటిక్ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరంలో చౌట్ పల్లి ప్రాథమిక కేంద్రం ల్యాబ్ టెక్నీషియన్ చిలివేరి పవన్ కుమార్ పలువురికి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి అధ్యక్షులు లుక్క గంగాధర్ మాట్లాడుతూ ప్రపంచంలో ప్రజలను పట్టిపీడిస్తున్న డయాబెటిస్ వ్యాధిని అరికట్టాలంటే అందరూ మానసిక ఉల్లాసంతో ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరు ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా షుగర్ టెస్ట్ చేసుకోవడం ద్వారా వారి ఆహారపు అలవాట్లను అదుపు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. శారీరిక శ్రమ, సంపూర్ణమైన ఆహారం తీసుకోవడం ద్వారా డయాబెటిక్ ను నియంత్రించే అవకాశం ఉందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు డయాబెటిక్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా, ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చెప్పటం జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ క్యాంపులో 130 మందికి టెస్టులు నిర్వహించి, వారికి తీసుకోవలసిన ఆహారం, జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి కార్యదర్శి రేవతి నలిమెల గంగాధర్, క్యాషియర్ తెడ్డు రమేష్, చింత ప్రదీప్, సుంకరి విజయ్ కుమార్, జగన్, రాహుల్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.



