Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తేవివి అక్రమ నియమకాలపై హైకోర్టు తీర్పు అమలు చేయాలి 

తేవివి అక్రమ నియమకాలపై హైకోర్టు తీర్పు అమలు చేయాలి 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2012- 13 సంవత్సరంలో జరిగిన ఆక్రమ నియామకాలను రద్దు చేస్తూ ఇటీవల రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు పరచాలని, తీర్పు వెలువడిన దాన్ని అమలు చేయకుండా అక్రమార్కుల కొమ్ముకాస్తున్న వి.సీ, రిజిస్టర్లపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ నేడు టి.పి.సి అధ్యక్షులు, మహేష్ కుమార్ గౌడ్ ని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ కలిసి వినతి పత్రం సమర్పించారు. 

ఈ సందర్భంగా గొల్లపల్లి రాజు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2012 – 13 సంవత్సరంలో జరిగిన నియామకాలపై సుదీర్ఘంగా విచారించి, అక్రమంగానే జరిగాయని తేల్చి వాటిని రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుని, స్థానిక యూనివర్సిటీ వి.సి, రిజిస్టార్లు పట్టించుకోకపోవడం, అమలు పరచాలని వి.సీని కలిసి హైకోర్టు ఉత్తర్వులను అందించి చర్యలు తీసుకోమని కోరిన సందర్భంలో ప్రభుత్వ పెద్దలకు అన్ని తెలుసునని ప్రభుత్వం పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్న విసి, రిజిస్టర్ లపై తక్షణమే పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆయన అన్నారు.

హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారని, దీనివల్ల అక్రమార్కులు ఈ తీర్పు పై మళ్లీ అప్పీల్ కు వెళితే యూనివర్సిటీ ఆబాసుపాలు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి హైకోర్టు తీర్పును తక్షణమే అమలు చేయాలని, బాధ్యులును తక్షణం విధుల నుండి తొలగించాలని, అదేవిధంగా గత 13 సంవత్సరాలుగా దుర్వినియోగమైన కోట్ల రూపాయల నిధులను రికవరి చేయాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చేయాలని కోరారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరిణామాలపై విచారిస్తామని, తగు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -