Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ ఘన విజయం

జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ ఘన విజయం

- Advertisement -

నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ 
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయకేతనం ఎగురవేశారు. బి ఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై దాదాపు 25 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక్కడి నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన నవీన్ యాదవ్ ఉప ఎన్నికల్లో సత్తా చాటారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేశారు. బాణాసంచా కాల్చి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ నవీన్ యాదవ్ గెలుపు కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించిన జూబ్లీహిల్స్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు మబ్బు రామరాజు గోరటి శ్రీనివాస్, ఎజాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రవి, శ్రీకాంత్, నాని యాదవ్, సంతు యాదవ్, దున్న భాస్కర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -