Friday, May 16, 2025
Homeజాతీయంమావోయిస్టు రహిత ఛత్తీస్‌గఢ్‌ నిర్మాణమే లక్ష్యం

మావోయిస్టు రహిత ఛత్తీస్‌గఢ్‌ నిర్మాణమే లక్ష్యం

- Advertisement -

– దండకారణ్యంలో ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి పర్యటన
నవతెలంగాణ -చర్ల

ఛత్తీస్‌గఢ్‌లోని ఊసూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధి దండకారణ్యం ప్రాంతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి గురువారం పర్యటించారు. బీజాపూర్‌ జిల్లాలోని ఊసూరు తహసీల్‌లోని గల్గమ్‌ గ్రామానికి చేరుకొని సీఆర్పీఎఫ్‌ జవాన్లు, స్థానిక గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన మావో యిస్టు వ్యతిరేక ఆపరేషన్‌ విజయం గురించి చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి భరతమాత, ఛత్తీస్‌గఢ్‌ మహతారిని కీర్తిస్తూ, నినాదాలు చేస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభిం చారు. మార్చి 2026 నాటికి ఛత్తీస్‌గఢ్‌ను పూర్తిగా నక్సల్స్‌ రహితంగా మార్చడమే లక్ష్యమని, దీనికి భద్రతా దళాలతో పాటు స్థానిక సమాజం సహకారం అవసరమని, దానికి ఈ ఆపరేషన్‌ కగార్‌ ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించారు. ఈ ఆపరేషన్‌లో కరేగుట్ట కొండపై 21 రోజుల పాటు కొనసాగిన ఆపరేషన్‌లో భద్రతా దళాలు 31 మంది కరుడుగట్టిన మావోయిస్టులను హతమార్చా యని, పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకు న్నాయని చెప్పారు. మన సైనికులు అజేయమైన ధైర్యంతో అంకితభావంతో ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేశారని అన్నారు. ఇది బీజాపూర్‌కే కాదు, మొత్తం రాష్ట్రానికే పెద్ద విజయం అని అన్నారు. గల్గాం, కరేగుట్ట ప్రాంతా లు చాలా కాలంగా మావోయిస్టు లకు బలమైన కోటగా పరిగణించబడుతున్నాయని, ఆపరేషన్‌ ఈ ప్రాంతాన్ని సురక్షితంగా మార్చడం పట్ల కొత్త ఆశలను రేకెత్తించిందని తెలిపారు. ప్రభుత్వం ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులను వేగవంతంగా చేపడుతుందని, విద్యా ఆరోగ్యం, ఉపాధి అవకాశాలను కూడా ప్రోత్సహిస్తుందని చెప్పారు. రోడ్లు, విద్యుత్‌, నీరు వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్థామని హామీ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి సైనికులతో కూర్చొని భోజనం చేశారు. గల్గామ్‌ క్యాంప్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ అరుణ్‌ దేవ్‌ గౌతమ్‌, బలగాల సిబ్బంది చేస్తున్న పౌర చర్యను ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఎం పలువురికి రేషన్‌ కార్డులు, ఆయుష్మాన్‌ కార్డులను పంపిణీ చేశారు. లొంగిపోయిన మావోయిస్టు కుటుంబాలకు ప్రత్యేక ప్రాజెక్ట్‌ అంగీకార పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ సెక్రటరీ సుబోధ్‌ కుమార్‌ సింగ్‌, బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ పి, డీఐజీ కమలోచన్‌ కశ్యప్‌, కలెక్టర్‌ సంబిత్‌ మిశ్రా, పోలీసు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జితేంద్ర యాదవ్‌తో పాటు అనేక మంది సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -