అంగన్వాడీ కేంద్రంలో బాలల దినోత్సవం
నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ పట్టణంలోనే సీతారాంపురం అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం బాలల దినోత్సవం నిర్వహించారు. సిడిపిఓ మమత ఆదేశానుసారం బాలల దినోత్సవం ఘనంగా జరిపారు. చిన్నారులు వివిధ వేషాదరణలతో అలరించారు. చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే బాలల దినోత్సవం గురించి వివరించారు. అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికమైన ఆహారం అందుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ సిహెచ్ పద్మ తెలిపారు. గర్భిణీలు బాలింతలు పోషకాహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. చిన్నారులు వివిధ ఆటపాటలతో అలరించారు. అదేవిధంగా 42 వార్డు సీతారాంపురంలో బాలల దినోత్సవం నిర్వహించారు చిన్నారులకు సిడిపిఓ మమత బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు షబానా, షాహిన్, మేహారాజ్, విజయ, గౌసియా, నజుమా, రాదాభాయ్ జగదీశ్వరి, సైదమ్మ, నాగమ్మ, మాధవి, వెంకటమ్మ, లబ్ధిదారులు పాల్గొన్నారు.
గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



