Friday, November 14, 2025
E-PAPER
Homeజిల్లాలుఅందేశ్రీ.. 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో నాలుక

అందేశ్రీ.. 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో నాలుక

- Advertisement -

తెలంగాణ ఉద్యమ కారుడు, గేయ రచయిత.. సలేంద్ర రాజన్న యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు

తెలంగాణ రాష్టాన్ని తన సొంత ఇల్లుగా కాసుకొని, తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలను తన సొంత అన్న తమ్ములుగా.. అక్కా చెల్లెలుగా చూసుకున్న, అందేశ్రీ ఈ భూమి ఆకాశాన్ని తన తల్లి తండ్రులుగా ప్రేమించాడని తెలంగాణ ఉద్యమ కారుడు, గేయ రచయిత సలేంద్ర రాజన్న యాదవ్ శుక్రవారం ఒక ప్రకటన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాలి, నీరు, నిప్పు, ఆకాశము, భూమిని తన ఆత్మ బంధువులుగా కొనియాడి ప్రతి నిమిషం ఆశ్వాదించాడన్నారు. ప్రకృతి కవి బిడ్డ అందేశ్రీ పేరుపై డిజిటల్ లైబ్రరీని తెలంగాణ రాష్ట్ర మంతట ఏర్పాటు చేయాలన్నారు. ప్రజా కవి, గాయకులు అందేశ్రీ రచనలు రానున్న తరాలకు తెలిసేలా పాఠ్య పుస్తకాలలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ 4 కోట్ల ప్రజల సమస్యలను తన కుటుంబ సభ్యుల సమస్యగా మహా గొప్ప మానవతా వాది మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు. అందేశ్రీ రాసిన రాష్ట్ర గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాఠ్య పుస్తకాలలో చేర్చాలని ఈ సందర్బంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -