నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం బాలల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు పుట్టినరోజును మన దేశంలో బాలల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుందని మండల విద్యాధికారి ఆంధ్రయ్య తెలిపారు. మండలంలోని పీఎంశ్రీ చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాస పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చాచా నెహ్రు కు పిల్లల పట్ల ఉన్న ప్రేమను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.



