Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం..

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం..

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు 
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం ప్రకటించి సంబరాల నిర్వహించుకున్నామనీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోతు బాలాజీ నాయక్ తెలిపారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కార్యకర్తలతో కలిసి టపాసులు పేల్చి సీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధికి ప్రజలు పట్ట కట్టారని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్  గెలిపించడంతో కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించుకున్నామని అన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనను ఎండగడుతూ రెండు ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమం చూసి ఓట్లు వేసి గెలిపించాలని అన్నారు. 

ప్రతి పేదవాడి  కి కడుపునిండా అన్నం తినాలన్న సంకల్పంతో అమలు చేస్తున్న సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంట్,  రేషన్ కార్డు ,మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసం ఉద్యోగల భర్తీ ప్రభుత్వ పాఠశాలలకు గురుకులాల అభివృద్ధి రైతులకు రైతు భరోసా ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడ్డారని అన్నారు.  మాట తప్పని పార్టీ అంటే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నిరూపించుకుంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో వెన్నం క్రాంతి రెడ్డి,  మౌనేందర్ సురేష్ నాయక్  శ్రీశైలం గంగిడి ఎల్లారెడ్డి వీరన్న ఏఎంసీ డైరెక్టర్ భాస్కర్ నాయక్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్  క్రాంతి రెడ్డి లింగమూర్తి రాజు నాయక్ కిషన్  రవి రాంజీ  వెంకన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల నాయకులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -