నవతెలంగాణ – హైదరాబాద్: 30 ఏండ్ల పాటు జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా నేడు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు, నిబంధనలు జారీ చేయనుంది. ఉత్తర్వుల తొలి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందజేయాలని ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. మరోవైపు, సుప్రీం తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతోందని ఉత్తమ్ వెల్లడించారు.
- Advertisement -