– ఉద్యాన పంటల సాగుపై రైతులకు అవగాహన
– పాల్గొన్న హెచ్ ఆర్ఎస్ హెడ్ డాక్టర్ విజయ్ క్రిష్ణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం మోజెర్ల ఉద్యాన కళాశాల విద్యార్థుల రూరల్ హార్టికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ లో భాగంగా శుక్రవారం మండలంలోని అచ్యుతాపురం పంచాయతీ రైతులకు అవగాహన,ఉద్యాన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల ఆకృతులు తో భూసార పరీక్షలు,జీవన ఎరువులు,హరిత గృహాలు, బహుళ అంతస్తుల పంటలు, తేనెటీగల పెంపకం,వర్మీ కంపోస్టింగ్ లాంటి ఉద్యాన రంగంలోని వివిధ ఆధునిక విశేషాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం హెడ్ డా.విజయ్ క్రిష్ణ,మోజర్ల ఉద్యాన కళాశాల బోధనా సిబ్బంది పాల్గొన్నారు.
వారు ఉద్యాన పంటల్లో తీసుకోవాల్సిన మెలకువలు, ఉద్యాన పంటల్లోని వివిధ అంశాల పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సత్య సాగర్, శివ, నేతాజీ, అభినయ్, అజయ్, యశ్వంత్, కృష్ణ కుమార్, వంశీ ,ధర్మ తేజ, నగేష్, సురేంద్ర లతో రైతులు సంతపురి చెన్నారావు,రాచూరి వెంకటేశ్వరరావు,కొనకళ్ళ చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.



