Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గండీడ్ మండలానికి ఎల్‌టి లోన్ మంజూరు కోసం వినతి..

గండీడ్ మండలానికి ఎల్‌టి లోన్ మంజూరు కోసం వినతి..

- Advertisement -

నవతెలంగాణ – గండీడ్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గండీడ్ మండలానికి ఎల్‌టి (లాంగ్ టర్మ్) లోన్ మంజూరు చేయాలని కోరుతూ ఉమ్మడి గండీడ్ మండల పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) చైర్మన్ గిరమోని లక్ష్మీ నారాయణ శుక్రవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి (డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్) చైర్మన్ కొత్త కుర్మా సత్తయ్య, సీఈఓ భాస్కర్ సుబ్రహ్మణ్యం, జనరల్ మేనేజర్ పి. ప్రభాకర్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు.

 వినతి పత్రాన్ని స్వీకరించిన డిసిసిబి చైర్మన్ కొత్త కుర్మా సత్తయ్య,సీఈఓ భాస్కర్ సుబ్రహ్మణ్యం, జనరల్ మేనేజర్ పి.ప్రభాకర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. వారు ఈ అభ్యర్థనను పరిశీలించి,తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సానుకూల స్పందనకు గాను,ఉమ్మడి గండీడ్ మండల పీఏసీఎస్ తరఫున డీసీసీబీ చైర్మన్,సీఈఓ,జనరల్ మేనేజర్‌లకు గిరమోని లక్ష్మీ నారాయణ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ లోన్ మంజూరు గండీడ్ మండల రైతులకు వ్యవసాయ అభివృద్ధిలో ఎంతో సహాయపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -