• ప్రధానోపాధ్యాయుడు పి. కళాధర్
• పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
నవతెలంగాణ-పెద్దవంగర
విద్యార్థులు ప్రాథమిక దశ నుండే ఉన్నత లక్ష్యాలను అలవర్చుకుని, లక్ష్యసాధన కోసం కృషి చేయాలని అవుతాపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి. కళాధర్ అన్నారు. పాఠశాలలో శుక్రవారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు చక్కగా పాఠ్యాంశాలు బోధించారు. డీఈవో గా స్పూర్తి, ఎంఈవో గా నిఖీల్, హెచ్ఎం గా ఎండీ సమీరా లు వ్యవహరించి ఆకట్టుకున్నారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో హెచ్ఎం మాట్లాడుతూ.. విద్యార్థులు పట్టుదల క్రమశిక్షణతో విద్యనభ్యసించి సమాజంలో గొప్ప పౌరులుగా ఎదగాలని, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రమేష్ కుమార్, రవి, శ్రీను, నరసింహా రావు, వెంకటేశ్వర్లు, సింహాద్రి, నర్సయ్య, మహబూబ్ అలీ, సమ్మయ్య, సోమయ్య, రామతారా, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను అలవర్చుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



