- Advertisement -
నవతెలంగాణ – మందమర్రి
లిటిల్ ఫ్లవర్స్ పాఠశాల విద్యార్థి తీర్థాల మణిరశ్విత్ రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు అర్హత సాధించాడు. శుక్రవారం తాండూర్ లో జరిగిన జోనల్ లెవెల్ అండర్–17 చెస్ పోటీలలో లిటిల్ ఫ్లవర్స్ పాఠశాల 9వ తరగతి విద్యార్థి తీర్థాల మణిరశ్విత్ విజయం సాధించాడు. ఈ విజయంతో అతడు జగిత్యాలలో ఈ నెల 15వ తేదీన జరగనున్న రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు అర్హత సాధించాడు. మణిరశ్విత్ విజయం పట్ల పాఠశాల కరెస్పాండెంట్ దామెర్ల సిద్దయ్య, ప్రిన్సిపాల్ దామెర్ల రమ, వైస్ ప్రిన్సిపాల్ కార్పె ప్రవీణ్ కుమార్, పిఈటి కుమార్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.
- Advertisement -



