– ఓటమికి గల కారణాలను విశ్లేసించుకుని ముందుకుపోతాం
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
– కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యన్ని కూని చేసింది
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ఎన్నికల్లో గెలుపొటములు సహజమని, ఓటమికి గల కారణాలను విశ్లేసించుకుని ముందుకుపోతామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ఇంచార్జ్ గా ఉన్న షేక్ పేట్ డివిజన్ లోని 12 బూత్ లలో బాల్కొండ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు బాద్యత తీసుకొని 1073 ఓట్ల మెజారిటీ తీసుక రావడం, అదేవిధంగా 12 బూత్ లన్నిట్లో లీడ్ రావడం చాలా గొప్ప విషయం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్బంగా నెల రోజులుగా అక్కడే ఉండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం నిర్వహించిన బాల్కొండ నియోజకవర్గ నాయకులను ఎమ్మెల్యే అభినందించారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యన్ని కూని చేసిందని పేర్కొన్నారు.
అధికార యంత్రాంగం, ఇతర వ్యవస్థలన్నింటిని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దుర్వినియోగం చేసిందని తెలిపారు. విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేస్తున్న పోలీసులు, ఎన్నికల కమిషన్ చోద్యం చూసిందని విమర్శించారు.సాంకేతికంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నైతిక విజయం బిఆర్ఎస్ పార్టీదేనని స్పష్టం చేశారు.ఓటమిని కూడా సవాల్ గా తీసుకొని కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇకముందు కూడా పోరాడుతూనే ఉంటామని తెలిపారు.



