Saturday, November 15, 2025
E-PAPER
Homeఆటలుసెమీస్‌కు లక్ష్యసేన్‌

సెమీస్‌కు లక్ష్యసేన్‌

- Advertisement -

జపాన్‌ మాస్టర్స్‌ 2025

టోక్యో (జపాన్‌) : భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ జపాన్‌ మాస్టర్స్‌ సూపర్‌ 500 టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈ ఏడాది మిశ్రమ ప్రదర్శనతో అంచనాలు అందుకోలేకపోతున్న లక్ష్యసేన్‌.. సెప్టెంబర్‌లో ముగిసిన హాంగ్‌కాంగ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా ముగియటమే ఉత్తమ ప్రదర్శన. శుక్రవారం టోక్యోలో జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో లక్ష్యసేన్‌ 21-13, 21-17తో వరల్డ్‌ నం.9 లో కీన్‌ యో (సింగపూర్‌)పై సూపర్‌ విజయం నమోదు చేశాడు. 39 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్‌లో అద్భుత ఆటతీరు కనబరిచిన లక్ష్యసేన్‌ వరుస గేముల్లో గెలుపొంది సెమీఫైనల్స్‌కు చేరుకున్నాడు. నేడు జరిగే సెమీఫైన్లలో వరల్డ్‌ నం.13 కెంటా నిషిమోటో (జపాన్‌)తో లక్ష్యసేన్‌ తలపడనున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -