- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్
ప్రముఖ మౌలిక వసతుల కంపెనీ రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చేతిలో 2025 సెప్టెంబర్ ముగింపు నాటికి రూ.9,000 కోట్ల ఆర్డర్లు ఉన్నట్లు వెల్లడించింది. గడిచిన జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బీ నుంచి రూ.2,085 కోట్ల విలువైన ఆర్డర్లు రావడం ద్వారా ఆర్డర్ బుక్ ఈ స్థాయికి చేరినట్టు ఆ సంస్థ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 75.60 కోట్ల నికర లాభాలను నమోదు చేసినట్టు తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.83 కోట్ల లాభాలు ఆర్జించింది. ఇదే సమయంలో రూ.527.40 కోట్ల ఆదాయం ఉండగా.. గడిచిన క్యూ2లో రూ.471.60 కోట్లకు పరిమితమైంది.
- Advertisement -


