Saturday, November 15, 2025
E-PAPER
Homeజాతీయంబిర్సా ముండాకు రాష్ట్రప‌తి నివాళి

బిర్సా ముండాకు రాష్ట్రప‌తి నివాళి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇవాళ‌ స్వాతంత్య్ర సమరయోధుడు ధరీ ఆబా భగవాన్‌ బిర్సా ముండా 150వ జయంతి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జన్‌జాతీయ గౌరవ్‌ దివాస్‌ కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. గిరిజన నాయకుడి పోరాటం, వారసత్వాన్ని స్మరించుకుంటూ న్యూఢిల్లీలోని పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లో ప్రేరణస్థల్‌లో బిర్సా ముండా విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ హరివంశ్‌, కేంద్ర మంత్రులు కిరణ్‌ రిజిజు, బిజెపి ఎంపీలు రంవీర్‌ సింగ్‌ బిదూరి, బన్‌సురి స్వరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -