- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో ప్రారంభమైన సరస్వతి నది పుష్కరాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి దక్షిణ త్రివేణి సంగమమైన కాళేశ్వర సన్నిధాన సరస్వతీ పుష్కరాలను ప్రారంభించడం నా పూర్వజన్మ సుకృతం అన్నారు. ఈ సందర్భంగా నిన్న సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్న ఫోటోలను సీఎం ఎక్స్ లో షేర్ చేశారు. నిన్న శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వరస్వామి వార్లను, సరస్వతి దేవిని సీఎం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- Advertisement -