Saturday, November 15, 2025
E-PAPER
Homeజిల్లాలుజోగులాంబ గద్వాల జిల్లాలో వయోవృద్ధుల వారోత్సవాలు

జోగులాంబ గద్వాల జిల్లాలో వయోవృద్ధుల వారోత్సవాలు

- Advertisement -

నవతెలంగాణ జోగులాంబ గద్వాల

మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం గద్వాల రిటైర్డ్ ఎంప్లాయీస్ కార్యాలయం ప్రాంగణంలో వృద్ధుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పౌరులకు ఉత్సాహాన్నిస్తూ క్యారమ్స్, చెస్, పాటల పోటీలు నిర్వహించగా, వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. వయోవృద్ధుల సంక్షేమానికి అందరూ కలిసి పని చేయాలనే సందేశంతో పాటు, సీనియర్ సిటిజన్ల ఆరోగ్యం, శ్రేయస్సు, సామాజిక భాగస్వామ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ర్యాలీ కూడా నిర్వహించినట్టు జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి సునంద తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సిబ్బంది, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం. లక్ష్మిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చక్రధర్, సభ్యులు బాలకృష్ణ రావు, బాలస్వామి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -