- Advertisement -
నవతెలంగాణ – భీంగల్జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలో వివిధ వార్డులలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కమిషనర్ గోపు గంగాధర్ పరిశీలించడం జరిగింది. లబ్ధిదారులతో కమిషనర్ మాట్లాడుతూ… నిర్మాణనికి సంబంధించిన డబ్బులను దశలవారీగా ప్రతి సోమవారం నాడు ఖాతా యందు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. కావున ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులలో ఇప్పటివరకు నిర్మాణం చేపట్టని లబ్ధిదారులతో, వారికి సంబంధించిన మేస్త్రీలను నిర్మాణము తొందరగా చేపట్టలని ఆదేశించినారు. ఈ కార్యక్రమంలో సంబంధిత మేనేజర్, వార్డ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


