సినీ సంగీత ప్రపంచంలో ఘంటసాల వేంకటేశ్వరరావు (ఘంటసాల) చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ‘ఘంటసాల ది గ్రేట్’ అనే మూవీని అన్యుక్త్ రామ్ పిక్చర్స్ సమర్పణలో సి.హెచ్. ఫణి నిర్మాణ సారథ్యంలో సి.హెచ్. రామారావు రచన, దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాలో కృష్ణ చైతన్య ఘంటసాలగా, మదుల ఘంటసాల సావిత్రమ్మగా, చిన్న ఘంటసాలగా తులసి మూవీ ఫేమ్ అతులిత నటించగా.. సుమన్ ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో శనివారం ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను ముఖ్య అతిథిగా హాజరైన ఆదిత్య హాసన్ లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఈ స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ మూవీని ప్రతీ ఒక్కరూ చూడండి. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
‘ఘంటసాల పాత్రను పోషించడం అదష్టంగా భావిస్తున్నాను. ఆయన పాటలు వింటూ పెరిగిన నేను ఈ రోజు ఇలా ఆయన జీవిత చరిత్రను చెప్పే క్రమంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఆయన ప్రయాణాన్ని ఈ చిత్రంలో ఆడియెన్స్ చూస్తారు. నాకు అవకాశం ఇచ్చిన రామారావుకి థ్యాంక్స్. ఇప్పటికే చాలా మంది ఈ మూవీని చూశారు. చూసిన వారంతా కూడా భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు సినీ సంగీతంలో మొదటిగా చెప్పుకునే పేరు ఘంటసాల.
ఘంటసాల, బాలు రెండు కళ్లలాంటి వారు. వారి ఆశీర్వాదంతో డిసెంబర్ 12న ఈ చిత్రం రాబోతోంది’ అని హీరో కృష్ణ చైతన్య చెప్పారు. దర్శకుడు రామారావు మాట్లాడుతూ, ‘పాట అనగానే అందరికీ ఘంటసాల గుర్తుకు వస్తారు. సింగర్‌గా కంటే ఆయన వ్యక్తిత్వం గురించి అందరికీ తెలియాలని ఈ సినిమాను తీశాను. ఘంటసాల పాత్రను పోషించమని చాలా మంది స్టార్లను అడిగాను. స్వరాభిషేకంలో కృష్ణ చైతన్యని చూసిన తరువాత ఘంటసాల వారిలా కనిపించారు. ఈ మూవీ ప్రివ్యూ చూసిన ప్రతీ ఒక్కరూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మూవీ బయటకు రాకుండా చేయాలని కొంత మంది ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలన్నీ విఫలం కావాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
‘ఘంటసాల..’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



