అరుళ్ నిథి, మమత మోహన్‌దాస్ ప్రధాన పాత్రల్లో ‘మై డియర్ సిస్టర్’ చిత్రాన్ని అద్భుతమైన విజువల్ ప్రొమోతో ప్రకటించారు. ఈ అన్‌స్క్రిప్టెడ్ టగ్-ఆఫ్-వార్ వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్యాషన్ స్టూడియోస్ ఎప్పటిలానే విభిన్న జోనర్స్‌లో కుటుంబం మొత్తం చూడగలిగే నాణ్యమైన సినిమాలను అందిస్తూ తమ ప్రత్యేకతను మరొకసారి చాటుకుంది. అన్నాచెల్లెళ్ళ బంధం ఎన్నాళ్లుగానో ముఖ్యమైన భావోద్వేగ అంశం. ‘పాసా మలర్’ నుంచి ‘వేదాళం’ వరకూ అన్నాచెల్లెల్ల అనుబంధం తరతరాలుగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూనే ఉంది. ఈ ఎమోషన్‌ని మరోసారి ముందుకు తీసుకువెళ్తూ, ప్యాషన్ స్టూడియోస్ ‘మై డియర్ సిస్టర్’ పేరుతో ఓ మనసుని తాకే భావోద్వేగపూరితమైన కథను అందిస్తోంది. ఈ చిత్రాన్ని ప్యాషన్ స్టూడియోస్ సుధన్ సుందరం , గోల్డ్‌మైన్స్ టెలిఫిలిమ్స్ మణీష్ షా కలిసి నిర్మిస్తున్నారు. ‘ఎన్నంగా సార్ ఉంగా సట్టం’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రభు జయరామ్ ఈ చిత్రానికి దర్శకుడు. కంటెంట్ బేస్డ్ పాత్రలతో ప్రత్యేకత సాధించిన అరుళ్ నిథి, మల్టీ టాలెంటెడ్ మమత మోహన్‌దాస్ అన్నాచెల్లెళ్ళుగా కనిపించబోతున్నారు. వీరి అనుబంధం సినిమా భావోద్వేగానికి కేంద్ర బిందువుగా ఉండనుంది.
ఇటీవల ‘బైసన్’తో సంగీత ప్రపంచంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నివాస్ ప్రసన్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇందులో మొత్తం ఏడు పాటలు ఉండగా, ఇవన్నీ సంగీత ప్రేమికులను ఆకట్టుకునేలా ఉంటాయి. దర్శకుడు ప్రభు జయరామ్ మాట్లాడుతూ,’ఈ చిత్ర కథానాయకుడు ‘పచ్చై కృష్ణన్’ పురుషాధిక్యత గల వ్యక్తి, మరొకవైపు అతని అక్క ‘నిర్మలాదేవి’ నిబద్ధత కలిగిన ఫెమినిస్టు. ఈ ఇద్దరి మధ్య ఉండే సిద్ధాంత ఘర్షణే కథకు ప్రధాన సారం. అరుళ్ నిథి, మమత మోహన్‌దాస్‌ల మధ్య షూటింగ్ సెట్లో జరిగే చిన్నచిన్న సరదా సంఘటనల నుంచే ఈ విజువల్ ప్రొమోలు అలరించాయి. ఆ సహజమైన, సరదా క్షణాల్ని ప్రమోషనల్ కంటెంట్‌లో కలిపి, సినిమాలో వారి పాత్రల మధ్య ఉండే భావోద్వేగాల్ని ఆకర్షణీయంగా చూపించాం’ అని తెలిపారు.
‘స్క్రిప్ట్ ఎంపికలో అరుళ్ నిథి చూపించే నాణ్యత, అతని ఒరిజినాలిటీకి ఉన్న నిబద్ధత ఈ చిత్రంలో కూడా కనిపిస్తుంది. అనౌన్స్‌మెంట్ వీడియో సినిమా టోన్, సారాంశాన్ని ప్రత్యేకంగా చూపిస్తుంది. గోల్డ్‌మైన్స్ టెలిఫిలిమ్స్ మణీష్ షాతో చేస్తున్న ఈ కలయిక మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది’ అని నిర్మాత సుధన్ సుందరం చెప్పారు.
ఆద్యంతం భావోద్వేగభరితంగా ‘మై డియర్ సిస్టర్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



