Sunday, November 16, 2025
E-PAPER
Homeజాతీయంమారుతి సుజుకి గ్రాండ్‌ విటారాలో లోపాలు

మారుతి సుజుకి గ్రాండ్‌ విటారాలో లోపాలు

- Advertisement -

39వేల యూనిట్ల రీకాల్‌
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి తన గ్రాండ్‌ విటారాలో పలు లోపాలు ఉన్నట్టు గుర్తించింది. ఫ్యూయల్‌ లెవల్‌ ఇండికేటర్‌, వార్నింగ్‌ లైట్‌లో లోపం కారణంగా 39,506 యూనిట్లను ఈ రీకాల్‌ చేపట్టినట్టు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. 2024 డిసెంబర్‌ 9 నుంచి 2025 ఏప్రిల్‌ 29 మధ్య తయారైన వాహనాల్లో ఈ లోపాలు ఉన్నాయని గుర్తించినట్టు పేర్కొంది. ఈ బ్యాచ్‌లో ఉత్పత్తయిన కొన్ని వాహనాల్లో స్పీడోమీటర్‌ అసెంబ్లీలో ఫ్యూయల్‌ లెవల్‌ ఇండికేటర్‌, వార్నింగ్‌ లైట్‌ సరిగా పనిచేయడం లేదని మారుతి సుజుకి పేర్కొంది. దీనివల్ల ప్యూయల్‌ స్టేటస్‌ అస్పష్టంగా చూపిస్తున్నట్టు తమ దృష్టికి రావడంతో.. ఈ లోపాన్ని సరిచేసే విషయంలో కార్ల యజమానులకు మారుతీ సుజుకీ డీలర్ల నుంచి వ్యక్తిగతంగా సమాచారం అందుతుందని తెలిపింది. కారును తనిఖీ చేసి వాటికి సంబంధించిన పరికరాలను ఉచితంగా మార్చి ఇవ్వనున్నట్లు పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -