Sunday, November 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపోస్టల్‌ ప్రత్యేక స్టాంపులు విడుదల

పోస్టల్‌ ప్రత్యేక స్టాంపులు విడుదల

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జన్‌జాతీయ గౌరవ్‌ ఉత్సవ్‌-2025 సందర్భంగా భగవాన్‌ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని తపాలాశాఖ ప్రత్యేక పోస్టల్‌ కవర్లను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని డాక్‌సదన్‌లో జరిగిన కార్యక్రమంలో జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యులు జాటోతు హుస్సేన్‌ ఈ ప్రత్యేక కవర్లను విడుదల చేశారు. ఇండియాపోస్ట్‌ పోస్టల్‌ సర్వీస్‌ బోర్డ్‌ సభ్యులు మనిషా సిన్హా, తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ డాక్టర్‌ డీ వీణాకుమారి తదితరులు పాల్గొన్నారు. ఏటా ఆదివాసీ దివస్‌ నాడు తపాలాశాఖ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రత్యేక పోస్టల్‌ కవర్లపై తెలంగాణ ఆదివాసీల నృత్యాలు, సంగీత వాయిద్యాలను ముద్రించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -