నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
అంత్యక్రియలకు హాజరు
నవతెలంగాణ-సంస్థాన్ నారాయణపురం
నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుజ్జ గ్రామానికి చెందిన రైతు సంఘం రాష్ట్ర నాయకులు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం తండ్రి బండ నర్సింహ(85) శనివారం తెల్లవారుజామున మృతిచెందారు. శనివారం నిర్వహించిన నర్సింహ అంత్యక్రియలకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, రాష్ట్ర సీనియర్ నాయకులు డిజి.నర్సింహారావు హాజరయ్యారు. నర్సింహ మృతదేహంపై ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. శ్రీశైలం కుటుంబానికి సానుభూతి, సంతాపం తెలిపారు.
ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డబ్బికార్ మల్లేశ్, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, పాలడుగు నాగార్జున, చినపాక లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, బూరుగు కృష్ణారెడ్డి, జి.శ్రీనివాసచారి, మాటూరి బాలరాజు, మండల కార్యదర్శి దోడ యాదిరెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి, పిట్ట రాములు, గంగాదేవి సైదులు, చాడ నరసింహ, బొమ్మగొని శంకరయ్య, కుకుడాల మంగమ్మ, వెలిజాల గోపిక సుందరయ్య తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు.
సీపీఐ(ఎం) జిల్లా నాయకులు బండ శ్రీశైలానికి పితృవియోగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



