నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ ఎన్డేయే గెలుపు జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రపంచ బ్యాంకు నుంచి పొందిన రుణంలో రూ. 14,000 కోట్లను ఉచితాల కోసం వాడారని అన్నారు. రాష్ట్రంలోని మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ. 10,000 బదిలీ చేసిన ‘‘సీఎం మహిళా రోజ్ గార్ యోజన’’ పథకాన్ని దుయ్యబట్టారు. ఈ డబ్బులతో మహిళ ఓటర్లను ఆకట్టుకున్నారని అన్నారు. అధికాం కోసం బీజేపీ కూటమి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు.నితీష్ కుమార్ ప్రభుత్వం ప్రజల డబ్బు ద్వారా ప్రజల ఓట్లను “కొనుగోలు” చేయడానికి రూ.40,000 కోట్లు ఖర్చు చేసిందని ఆయన ఆరోపించారు.
ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూల ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. 243 సీట్లు ఉన్న అసెంబ్లీలో ఏకంగా 202 స్థానాలు సాధించింది. ఇందులో బీజేపీ 89, జేడీయూ 85 , చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ 19, ఇతర పార్టీలు మిగిలిన స్థానాలను దక్కించుకున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మహాఘట్బంధన్ కేవలం 35 సీట్లకు మాత్రమే పరిమితం కాగా..జన్‌సురాజ్ పార్టీ మాత్రం ఖాతా కూడా తెర్వాలేదు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు.



