Sunday, November 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రన్ ఫర్ సోషల్ జస్టిస్ విజయవంతం..

రన్ ఫర్ సోషల్ జస్టిస్ విజయవంతం..

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లను కల్పించాలనని రాష్ట్ర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అష్టాంగ కార్యక్రమాల పేరుతో వివిధ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా బీసీ జేఏసీ రాష్ట్ర కో చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ నాయకత్వలో రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమనికి పిలుపునిచ్చారు.రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపుమేరకు  (ఆదివారం 16వ తేదీ) నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో ఉదయం రన్ ఫర్ సోషల్ జస్టిస్ ఉదయపు నడక కార్యక్రమం నిర్వహించారు.ఇంత ఉదయం ఇంత చలిలో ఇంత పెద్ద ఎత్తున బీసీలు రన్ ఫర్ సోషల్ జస్టిస్ ఉదయపు నడక కార్యక్రమానికి హాజరు కావడంతో బీసీల చైతన్యం ప్రస్ఫుటంగా కనబడుతుందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు.

ఇక బీసీ ఉద్యమాన్ని ఆపడం ఎవరి తరం కాదని బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 42 శాతం రిజర్వేషన్లు అమరులు పరచాల్సిందేనని బీసీ సంక్షేమ నరాల సుధాకర్ నినదించారు. ఈరోజు ఒక్క పిలుపునివ్వగానే ఇంతమంది బిసి బిడ్డలు ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషకరమని, బీసీలు మేమెంతో మాకు అంత వాటా కావాల్సిందే అని చెప్పకనే చెబుతున్నారని నరాల సుధాకర్ అన్నారు. 9% కూడా లేని అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో పది శాతం రిజర్వేషన్లను అమలు పరిచిన కేంద్ర ప్రభుత్వం 56% ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు పరచడానికి ఎందుకు వెనుకడుగు వేస్తుందని రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్సా ఆంజనేయులు ప్రశ్నించారు. ఇకముందు బీసీ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని జిల్లా ప్రధాన కార్యదర్శి పోల్కమ్ గంగ కిషన్ అన్నారు. బీసీలలో బీసీ భావజాలాన్ని క్షేత్రస్థాయికి తీసుకు వెళ్తామని నగర అధ్యక్షుడు దర్శనం దేవేందర్ అన్నారు.రన్ ఫర్ సోషల్ జస్టిస్ బీసీల ఉదయపు నడక కార్యక్రమంలో నరాల సుధాకర్ తో పాటు బుస ఆంజనేయులు పోల్కం గంగ కిషన్ దర్శనం దేవేందర్ కరిపే రవీందర్ కొయ్యడ శంకర్ బగ్గలి అజయ్ చంద్రకాంత్ శ్రీలత చంద్రమోహన్ తోట రాజశేఖర్ ఆర్టీసీ శ్రీనివాస్ నరసయ్య దయానంద్ భూమయ్య బాలన్న సదానంద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -