Sunday, November 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హామీలేనా…ఆచరణ లేదా..?

హామీలేనా…ఆచరణ లేదా..?

- Advertisement -

ప్రభుత్వం..ఎమ్మెల్యే తీరుపై నిరసన
తిరిగి కలిపే ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరిక 
నవతెలంగాణ-బెజ్జంకి

ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కి..నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మండలానికి తీరని అన్యాయం చేసిందని.. అధికారం చేపట్టాక వంద రోజుల్లో మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలుపుతామని ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీ వారి మాటలకే పరిమితం చేసుకుని ఆచరణ చేయకుండా మండల ప్రజలను వీళ్లు మోసం చేశారని కరీంనగర్ జిల్లా సాధన పోరాట సమితి సభ్యులు మండిపడ్డారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ ఎన్నికల ప్రచార సభలో టీపీసీసీ అధ్యక్షుడి హోధాలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సంయుక్తంగా మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలుపుతామని ఇచ్చిన హామీని విస్మరించిన తీరుపై ఆదివారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద కరీంనగర్ జిల్లా పోరాట సమితి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ఎమ్మెల్యే తను ఇచ్చిన హామీని ఆచరణ పెట్టి చిత్తశుద్దితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు..మేనిఫేస్టోలో పొందుపర్చిన హామీలపై ఉద్యమం ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.పోరాట సమితి సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -