డివిజన్ అధ్యక్షుడు మూడవత్ జగన్ నాయక్
నవతెలంగాణ- మిర్యాలగూడ
మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో ఆదివారం సెలవు దినం రోజు అయినా కూడా పాఠశాలను నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాల పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు ముడవత్ జగన్ నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆ పాఠశాల తరగతులను బహిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోను అవుతున్న చైతన్య పాఠశాలలు విద్యార్థుల పై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. తక్షణమే శ్రీ చైతన్య పాఠశాల పై విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అనేక ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యులు బన్నీ, వెంకటేష్, సుభాష్, కిరణ్, హేమంత్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
సెలవురోజున పాఠశాల నిర్వహిస్తున్న శ్రీచైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


