Sunday, November 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మిర్యాలగూడలో మంత్రుల పర్యటన ఏర్పాట్లు పరిశీలన

మిర్యాలగూడలో మంత్రుల పర్యటన ఏర్పాట్లు పరిశీలన

- Advertisement -

నవతెలంగాణ- మిర్యాలగూడ 
మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. పౌర సరఫరాల శాఖ, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు, భవన నిర్మాణల శాఖ, సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  హాజరుకానుండగా ఏర్పాట్లను ఆదివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..మంత్రులు ఉదయం 9:30 గంటలకు హెలిప్యాడ్ ల్యాండ్ అయిన అనంతరం రోడ్డు మార్గం ద్వారా  కాల్వపెల్లి నందు  శెట్టి పాలెం నుంచి అవంతిపురం వరకు నిర్మిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డు కు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు.  ఇదులగూడ బైపాస్ నందు గల కే ఎన్ ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన బిల్డింగ్ ప్రారంభిస్తారన్నారు.  హోసింగ్ బోర్డు నందు ప్రభుత్వం జూనియర్ కళాశాల నందు నిర్మించిన నూతన భవనం ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం  పట్టణంలోని ఫ్లైఓవర్ వద్ద  పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో 75 కోట్ల 25 లక్షలో నిర్వహిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల శిలాపలకాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో బి ఎల్ ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా అన్నప్రసాధ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -