Sunday, November 16, 2025
E-PAPER
Homeఖమ్మంపక్షం రోజులుగా నీటి కొరత ఇక్కట్లుకు గురౌతున్న గిరిజనులు

పక్షం రోజులుగా నీటి కొరత ఇక్కట్లుకు గురౌతున్న గిరిజనులు

- Advertisement -

– బోరు మరమ్మత్తులకు పంపాం : కార్యదర్శి అలివేలు
నవతెలంగాణ – అశ్వారావుపేట

మండలంలోని అనేక ఆవాసాలలో ప్రజలు నీటి ఎద్దడికి గురౌతున్నారు. పంచాయితీల్లో నిధులు లేవని స్థానిక సిబ్బంది చెప్తుండగా,గ్రామస్థులు తమ స్వంత ఖర్చులతో మరమ్మత్తులు చేయించ మన్నా సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. మండలంలోని నందిపాడు పంచాయితీ లోని కేసీఆర్ కాలనీ లో 20 గృహాలు ఉన్నాయి.ఈ కాలనీ కోసం ఏర్పాటు చేసిన బోరు పదిహేను రోజుల క్రితం మరమ్మత్తులకు గురైంది.అప్పటి నుండి సమీపంలోని పాఠశాల ప్రాంగణంలో గల చేతి పంపు ద్వారా ఈ కాలనీ వాసులు నీటి అవసరాలను తీర్చుకుంటున్నారు.

ఆదివారం ఆ కాలనీ ని నవతెలంగాణ సందర్శించింది.ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కార్యదర్శికి చెప్తే పంచాయితీలో నిధులు లేవంటుంది.మేమే ఇంటికి కొంత వసూలు చేసి మరమ్మత్తులు చేయించు కుందామని అనుకుంటే మెకానిక్ రూ. 6 వేలు ఖర్చు అవుతుందని తెలిపారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇదే విషయం అయి కార్యదర్శి అలివేలు ను వివరణ కోరగా బోరు మరమ్మత్తులకు పంపామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -