Sunday, November 16, 2025
E-PAPER
Homeఖమ్మంచదరంగం క్రీడాకారిణి భవ్యశ్రీని సన్మానించిన ఐఎఫ్ఎల్ సంస్థ

చదరంగం క్రీడాకారిణి భవ్యశ్రీని సన్మానించిన ఐఎఫ్ఎల్ సంస్థ

- Advertisement -

– రూ.10 వేలు పారితోషికంగా అందచేసిన ఎండీ బొమ్మగాని బాలకృష్ణ 
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఇటీవల చదరంగంలో జాతీయ స్ధాయి పోటీలకు ఎంపికైన స్థానిక క్రీడా కారిణి భవ్యశ్రీ లక్ష్మిని ఐఎఫ్ఎల్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వ్యవసాయ రంగంలో సేవలందిస్తూ,రైతులను పెట్టుబడులకు ప్రోత్సహిస్తూ స్థిరమైన రాబడికి చర్చలు జరపటం,సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటున్న ఐ ఎఫ్ ఎల్ గ్రీన్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్,ఏలూరు జిల్లా,జంగారెడ్డిగూడెం రీజినల్ కార్యాలయం లో మేనేజింగ్ డైరెక్టర్ బొమ్మ గాని బాలకృష్ణ ఆధ్వర్యంలో చదరంగం భవ్య శ్రీలక్ష్మి ని తన తల్లిదండ్రులు కేశిబోయిన వీరాంజనేయులు –  రమాదేవి దంపతులను ఘనంగా సన్మానించారు. 

ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ బొమ్మగాని బాలకృష్ణ మాట్లాడుతూ.. చదరంగంలో రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చాటుతూ అశ్వారావుపేట ప్రాంతానికి గుర్తింపు తెచ్చిన భవ్యశ్రీ లక్ష్మీ మరిన్ని విజయాలు సాధిస్తూ మంచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఈ నెల 20 వ తారీఖున జరగబోయే జాతీయస్థాయి పోటీల్లో కూడా విజయం సాధించాలని మన ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. మా సంస్థ ప్రత్యేక అభినందనలతో పాటు పారితోషికంగా రూ.10 వేలను ఆమెకు అందజేస్తున్నామని తెలిపారు.మా సంస్థ జూన్ 15, 2021లో స్థాపించబడిన నాటి నుండి వ్యవసాయ అభివృద్ధితో పాటు సామాజిక బాధ్యతా కార్యక్రమాల్లో కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించిందని ప్రతి సంవత్సరం క్రీడల ప్రోత్సాహం, మెడికల్ క్యాంపులు,విద్యార్ధులకు స్ఫూర్తిదాయక కార్యక్రమాలు,రాష్ట్ర – జాతీయ స్థాయి క్రీడాకారుల్ని ప్రోత్సహించడం మా ఐ ఎఫ్ ఎల్ సంస్థ యొక్క  ప్రత్యేకత అని తెలిపారు.

అనంతరం అశ్వారావుపేట కు చెందిన సంస్థ  డైరెక్టర్ ఎస్.కె అబ్దుల్ రెహమాన్ బాబా మాట్లాడుతూ “గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభ ను ప్రోత్సహించడం మా బాధ్యత అని భవ్య శ్రీలక్ష్మి వంటి క్రీడాకారులు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని ఇటువంటి వారికి మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది” అని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీనరీని పెంపొందించటమే మా ప్రధాన లక్ష్యమని ఆ విధంగా రైతులను, ప్రజలను, విద్యార్థులను యువతీ యువకులను ప్రోత్సహించటం మా ప్రధాన విధి అని  ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ ఎల్  గ్రీన్ ప్రొడ్యూసర్ కంపెనీ డైరెక్టర్లు సయ్యద్ మహబూబ్, ఎస్.కె పాషా,అత్తిలి వీరబాబు, ఎస్.కె ఇక్బాల్ , జొన్నలగడ్డ కాంతారావు, ఎస్.కె ఖలీల్ భాష, రవికుమార్,జీ.వరలక్ష్మి,సంస్థ సిబ్బంది  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -