– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం వేల్పూర్ లోని తన స్వగృహంలో మంజూరు కోసం సిద్ధంగా ఉన్న మెండోరా మండలంకు చెందిన 35 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బ్యాచ్ ఫైల్స్ పై ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంతకాలు చేశారు.ఈ సందర్బంగా ఫైల్స్ మీ వద్ద పెండింగ్ ఉంచుకోకుండా త్వరితగతిన సంతకాలు తీసుకొని ప్రభుత్వానికి పంపించాలని తహషీల్దార్ ను అదేశించారు. అదే విధంగా ఇప్పటి వరకు మంజూరు అయినా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు నూతనంగా మంజూరయ్యే వారికీ అందరికి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా తులం బంగారం ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



