Tuesday, April 29, 2025
Homeట్రెండింగ్ న్యూస్జనగామలో సూసైడ్ చేసుకున్న మహిళా కానిస్టేబుల్

జనగామలో సూసైడ్ చేసుకున్న మహిళా కానిస్టేబుల్

నవతెలంగాణ – హైదరాబాద్: సంబంధాలు కుదరక పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. జనగామ (D) కొడకండ్ల (M) నీలిబండతండాకు చెందిన గగులోత్ నీల(26)కు 2020లో AR కానిస్టేబుల్ ఉద్యోగం రాగా వరంగల్‌లో పని చేస్తున్నారు. శనివారం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన ఆమె ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని చనిపోయారు. గత కొద్ది కాలం నుంచి నీలిమకు వరుసగా పెళ్లి సంబంధాలు వస్తున్నా ఒక్కటి కూడా నిశ్చయం అవ్వలేదు. దీంతో కొద్దిగా విరామం తీసుకొని మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయినా కూడా ఆమెను చేసుకునేందుకు ఎవరు ముందుకు రాలేదు. దీంతో అవమానభారంతో కుంగిపోయిన నీలిమ మనస్థాపం చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో నీలిబండ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న కొడకండ్ల పోలీసులు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img