Monday, November 17, 2025
E-PAPER
Homeజిల్లాలుమురికి కాలువల నిర్వహణలేమితో రోగాల బారిన పడుతున్న ప్రజలు..

మురికి కాలువల నిర్వహణలేమితో రోగాల బారిన పడుతున్న ప్రజలు..

- Advertisement -

– కొండమడుగు నర్సింహ..సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు
నవతెలంగాణ – భువనగిరి

అనాజిపురం గ్రామంలో అన్ని వార్డులలో మురికి కాలువల నిర్మాణం లేకపోవడం, నిర్వహణ కూడా సరిగా లేకపోవడంతో చెత్తాచెదారం పెరుకపోయి దోమల బెడదతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ అన్నారు. ఆదివారం భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలో సీపీఐ(ఎం) ఇంటింటి సర్వే కార్యక్రమంలో భాగంగా వివిధ వార్డులలో ఉన్న ప్రజలను కలిసి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ.. వార్డులో మురికి కాలువ ఉన్న  దానిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోవడం, గడ్డిని తీసేయకపోవడంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి ప్రజలు పెద్ద ఎత్తున రోగాల బారిన బడి డెంగ్యూ లాంటి జ్వరాలకు గురవుతున్నారని అన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామాలలో మురికి కాలువలు, సిసి రోడ్లు, వీధిలైట్లు, ప్రజల తక్షణ మౌలిక సమస్యల పరిష్కారం కోసం తగిన నిధులు కేటాయించాలని, ప్రత్యేక క్యాంపెయిన్ ద్వారా గ్రామంలో ఎక్కడికక్కడ పేరుకపోయినా చెత్తను, గడ్డిని తొలగించాలని నర్సింహ డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ డాక్టర్ బొల్లెపల్లి కుమార్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి మల్లేష్ , సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు గునుగుంట్ల శ్రీనివాస్, మండల కమిటీ సభ్యులు అబ్దుల్లాపురం వెంకటేష్ , శాఖ కార్యదర్శి జనగామ ఏదునూరి వెంకటేష్ , నాయకులు బొల్లెపల్లి స్వామి, గంగాదరి బాన్ ప్రకాష్ , ప్రజలు పిట్టల ప్రమీల, పిట్టల కమలమ్మ, పిట్టల భాగ్యమ్మ, భోగ భావాన్ని , ఏదునూరి వసంత, భోగ లక్ష్మి  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -