Monday, November 17, 2025
E-PAPER
Homeసినిమామరో హిట్‌ సినిమా కోసం..

మరో హిట్‌ సినిమా కోసం..

- Advertisement -

కోలీవుడ్‌లో రీసెంట్‌గా ‘జో’ అంటూ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను అందించిన నిర్మాణ సంస్థ విజన్‌ సినిమా హౌస్‌. ఈ సంస్థ నుంచి తదుపరి ప్రాజెక్ట్‌ ప్రొడక్షన్‌ నెంబర్‌ 3ని ప్రారంభించారు. తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా రూపు దిద్దుకుంటోంది. ‘కోజిపన్నై చెల్లదురై’, ‘కానా కానమ్‌ కాలంగల్‌’ వంటి వాటిలో అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఏగన్‌, ‘కోర్ట్‌’ చిత్రంతో అందరినీ ఆకట్టుకున్న శ్రీదేవీ, ‘మిన్నల్‌ మురళి’ ఫేమ్‌ ఫెమినా జార్జ్‌ ఈ చిత్రంలో ప్రముఖ పాత్రల్ని పోషించనున్నారు.

ఈ ప్రాజెక్ట్‌కు రీసెంట్‌ సెన్సేషన్‌ విజయ్ బుల్గానిన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘బేబీ’, ‘కోర్ట్‌’ వరుసగా బ్లాక్‌ బస్టర్‌, చార్ట్‌బస్టర్‌ మ్యూజిక్‌ను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్‌ ఇవ్వనున్నారు. ‘ఆహా కళ్యాణం’ చిత్రానికి దర్శకత్వం వహించిన యువరాజ్‌ చిన్నసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ‘జో’ విజయం తర్వాత విజన్‌ సినిమా హౌస్‌ మంచి సబ్జెక్ట్‌, కంటెంట్‌ ఓరియెంటెడ్‌ చిత్రాల్ని అందించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే నిర్మాతలు డా.డి.అరుళనందు, మాథ్యూయో అరుళనందు క్వాలిటీ కోసం ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించేందుకు సిద్దంగా ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -