Monday, November 17, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో బర్డ్‌ఫ్లూ కలకలం

అమెరికాలో బర్డ్‌ఫ్లూ కలకలం

- Advertisement -

వాషింగ్టన్‌లో కేసు నమోదు

వాషింగ్టన్‌ : అమెరికాలో బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. వాషింగ్టన్‌ రాష్ట్రంలో ఒక వ్యక్తికి బర్ట్‌ఫ్లూ వైరస్‌లో నూతన వేరియంట్‌ హెచ్‌5ఎన్‌5 సోకినట్లు గా గుర్తించారు. గురువారం ప్రాథమిక పరీక్షల్లో హెచ్‌5ఎన్‌5ను గుర్తించగా, శుక్రవారం ధ్రవీకరికం చారు. ఫిబ్రవరి తరువాత అమెరికాలో ఇది తొలి బర్డ్‌ఫ్లూ కేసు. తాజాగా గుర్తించిన ఇన్ఫెక్షన్‌ మునుపటి ఇన్ఫెక్షన్ల కన్నా భిన్నంగా ఉందని వైద్య అధికారులు తెలిపారు. బర్డ్‌ఫ్లూ సోకిన వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ బర్డ్‌ఫ్లూ కేసుతో అమెరికా లో ప్రజారోగ్యానికి ప్రమాదం పెరిగిందని ఆ దేశ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతం కనుగొన్న హెచ్‌5ఎన్‌5, గతంలో వున్న హెచ్‌5ఎన్‌1 వైరస్‌ల మధ్య వ్యత్యాసం ఉందని వెల్లడించిది. వైరస్‌ను విడుదల చేయడంలోనూ, ఇతర కణాలకు వ్యాప్తి చెందడాన్ని ప్రోత్సహించడంలోనూ ఇది మరింత చురుగ్గా ఉంటుందని పేర్కొంది. ప్రసుత్తం బర్డ్‌ఫ్లూ సోకిన వ్యక్తిని గ్రేస్‌ హార్బర్‌ కౌంటీ నివాసి అయిన వృద్ధుడుగా గుర్తించారు. ఇతని ఇంటి వెనుక పెంపుడు జంతువుల శాల ఉంది. ఇందులో అడవి పక్షులను పెంచుతున్నారు. అమెరికాలో 2024, ఈ ఏడాది ప్రారంభంలో సంభవించిన బర్డ్‌ఫ్లూ వ్యాప్తిలో 70 మందికి ఈ వైరస్‌ను గుర్తించారు. వీరిలో ఎక్కువ మంది పాడి, పౌల్ట్రీ పరిశ్రమల్లో పనిచేశారు. వీరిలో ఒక వ్యక్తి మృతి చెందగా, మిగిలినవారు తేలికపాటి అనారోగ్యాలతో బాధపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -