సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నేతల సంతాపం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పీఆర్టీయూ వ్యవస్థాపక సభ్యులు, ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి, విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.నారాయణ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ పరిస్థితి విషమించి హైదరాబాద్‌లో శనివారం అర్ధరాత్రి మరణించారు. ఆయనకు భార్య గిరిజామని, కుమారుడు శ్రీకాంత్, కూతురు రమాదేవి ఉన్నారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు లింగంపల్లిలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఆయన మృతికి సీపీఐ(ఎంఎల్)మాస్‌లైన్ రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది. అంత్యక్రియల్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.హన్మేష్, సదానందం, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.సూర్యం, ఎస్‌ఎల్.పద్మ, పీవైఎల్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కేఎస్.ప్రదీప్, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి అనిల్, పీవైఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవికుమార్, మనోహర్ రాజు(టీపీటీఎఫ్), అనిల్ ,తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఉద్యమంలో నారాయణ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. అందరికీ ఉచిత విద్య, శాస్త్రీయ విద్య అందని చివరి శ్వాస వరకు పనిచేశారని కొనియాడారు.
నారాయణకు జోహార్లు : టీపీటీఎఫ్
ఉపాధ్యాయ, విద్యారంగ, సామాజిక ఉద్యమాల నేత కె.నారాయణకు టీపీటీఎఫ్ జోహార్లు తెలిపింది. క్యాన్సర్ సమస్యతో ఈ నెల 15న రాత్రి 11 గంటలకు నారాయణ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలను నల్లగొండ్లలో నిర్వహించారు. ఈ మేరకు టీపీటీఎఫ్ అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్, ప్రధానకార్యదర్శి నన్నెబోయిన తిరుపతి ఒక ప్రకటన విడుదల చేశారు. ”నారాయణ ప్రస్తుత రాజన్న సిరిసిల్లా జిల్లాలోని మారుమూల పల్లెటూరు ఓబులాపురంలో జన్మించారు. నారాయణ పంచాయితీరాజ్ ఉపాధ్యాయుల సమస్యల కోసం 1971లో పీఆర్టీయూ సంఘ వ్యవస్థాపనకు, కామన్ స్కూల్ విద్యావిధానం, శాస్త్రీయ విద్యా విధానం కొరకు జరుగుతున్న ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఉపాధ్యాయుల ప్రమోషన్‌లు, ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించడంలో క్రియాశీల పాత్ర పోషించారు. ఉద్యోగ విరమణ అనంతరం న్యాయవాదిగా న్యాయపోరాటం చేశారు. ఆయన మరణం ప్రజాస్వామిక ఉద్యమాలకు, విద్యారంగ ఉద్యమాలకు తీరని లోటు. నారాయణ మరణానికి సంతాపం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి…” అని వారు తెలిపారు.
ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి కె.నారాయణ మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



